ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
జయపురం: జయపురం ఆదర్శనగర్‌లో గల డీపీ అకాడమి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 19 ఏళ్ల లోపు క్రీడాకారుల మధ్య జరిగిన బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు పోటీలు నిర్వహించారు. ఫైనల్స్ పోటీలలో బాలికల సింగిల్స్‌లో గీతాశ్రీ డే విన్నర్‌గా, అన్సిక బిరోక్ రన్నర్‌గా నిలిచారు. బాలల సింగిల్స్ పోటీలో మయాంక భరధ్వాజ్ విన్నర్‌గా, సోమ్యజిత్ సాహు రన్నర్‌గా సత్తాచాటారు. బాలుర డబుల్స్‌లో బపూన్ రౌత్, దవివ్యమ్ కేజరీవాల్ విన్నర్లుగా, శ్రీయాంశు జెన, శుబ్ర కేతన మల్లిక్ రన్నర్లుగా నిలిచారు. మిక్సిడ్ డబుల్స్‌లో జయేష్ అగర్వాల్, సీతి ప్రియ ప్రధాన్‌లు విన్నర్‌గా, అగస్త్య నాయక్, ఆధ్య పాడీలు రన్నర్స్‌గా నిలిచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. బహుమతుల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నారు. జయపురంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. 94 మంది క్రీడాకారులు పాల్గొన్నారని డీపీ అకాడమీ ప్రతినిధి నిమయి చరణ దాస్ వెల్లడించారు. విజేతలకు ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, గౌరవ అతిథిగా పాల్గొన్న జయపురం సబ్‌కలెక్టర్ ఎ.శొశ్యరెడ్డి బహుమతులు అందజేశారు. ఒడిశా బ్యాడ్మింటన్ సంఘం రిఫరీ లక్షపతి నందా, పర్యవేక్షకులు సందీప్ మిశ్ర, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కో ఆర్డినేటర్ సంతోష్ బెవర్త, రాయగడ జిల్లా సంఘ కార్యదర్శి సురేష్ చంద్ర పండా, కొరాపుట్ జిల్లా సంఘ కార్యదర్శి శైలేష్ కుమార్ చౌదరి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ సభ్యులు ఆశ్రిత పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు


