శిశు విద్యా పథకం ప్రారంభం
కొరాపుట్: రాష్ట్ర వ్యాప్తంగా శిశు విద్యా పథకం లాంఛనంగా ప్రారంభమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విద్యా శాఖ మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని బోర్డు స్కూల్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రాథమిక విద్యా పథకం–2020ను అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించారు. ఐదేళ్ల బాలలు కిండర్ తరగతి, ఆరేళ్ల పిల్లలు 1వ తరగతిలో చేర్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం బాలలకు పలక, బలపం, బ్యాగ్ తదితర విద్యా సామగ్రి పంపిణీ చేశారు. సెల్ఫీ పాయింట్, ప్రచార రథాలు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వీ.కీర్తివాసన్ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. సీఎల్‌పీ నాయకుడు రాం చంద్ర ఖడం పొట్టంగిలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు.
శిశు విద్యా పథకం ప్రారంభం
శిశు విద్యా పథకం ప్రారంభం
శిశు విద్యా పథకం ప్రారంభం


