సమష్టి కృషితో వైద్యారోగ్యశాఖకు గుర్తింపు
పార్వతీపురంటౌన్: అంకిత భావంతో పనిచేసి మెరుగైన ఫలితాలు అందించాలని జిల్లా వైద్యరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు కార్యాలయ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, సిబ్బందితో గురువారం ఆయన సమావేశం నిర్వహించి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా జిల్లాలో చెపడుతున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసి సకాలంలో అందజేయాలని సూచించారు. తద్వారా వెనుకంజలో ఉన్న ఆరోగ్య కేంద్రాలను గుర్తించి అందుకు గల కారణాలపై విశ్లేళషణ్ చేసి పనితీరును మెరుగుపర్చవచ్చన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు తీరును పర్యవేక్షించాలని చెప్పారు. ఈ క్రమంలో మాతా, శిశు వైద్య సేవలు, టీకాల నిర్వహణ, అసంక్రామిక వ్యాధుల సర్వే, టీబీ, లెప్రసీ, స్కూల్ హెల్త్, స్వచ్ఛాంద్ర తదితర ఆరోగ్య కార్యక్రమాలు జిల్లాలో పకడ్బందీగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేసి, సంబంధిత పోర్టల్స్, యాప్‌లో నమోదు తీరును పరిశీలించాలని సూచించారు.
కార్యక్రమంలో డీఐఓ ఎం. నారాయణరావు, జిల్లా ప్రాగ్రాం అధికారులు డాక్టర్ జగన్మోహనరావు, డాక్టర్ పీఎల్ రఘుకుమార్, డాక్టర్ ఎం.వినోద్ కుమార్, సూపరింటెండెంట్ కామేశ్వరరావు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కరరావు


