స్ట్రాంగ్‌రూంల వద్ద కట్టుదిట్ట భద్రత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ చెప్పారు. ఈనెల 27న జరగనున్న ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు స్ట్రాంగ్ రూంలను గురువారం ఎస్పీ పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియమించాల్సిన పోలీస్ బందోబస్తు, స్ట్రాంగ్ రూంల వద్దకు వెళ్లే మార్గాలు, బ్యాలెట్ పెట్టెల తరలింపుపై చర్చించి, పలు సూచనలు చేశారు. అనంతరం రెవెన్యూ శాఖ నుంచి చేపట్టే ఏర్పాట్లపై ఆరాతీశారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ చెప్పారు. ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, తూర్పు, పశ్చిమ తహసీల్దార్లు గణేష్ (తూర్పు), వెంకటేశ్వర్లు (పశ్చిమ), కళాశాల ప్రిన్సిపల్ మోజేస్ పాల్గొన్నారు.
గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment