పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Mon, Feb 24 2025 1:55 AM | Last Updated on Mon, Feb 24 2025 1:51 AM

పల్నా

పల్నాడు

సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

ప్రశాంతంగా గ్రూప్‌–2 మెయిన్స్‌

జిల్లాలో 85.45 శాతం హాజరు

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌) / గుంటూరు రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ ఆదివారం జరిగింది. పేపర్‌–1, పేపర్‌ –2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 9,277 మంది అభ్యర్థులకుగాను పేపర్‌–1కు 7,927 మంది, మధ్యాహ్నం పేపర్‌–2కు 7,920 మంది హాజరయ్యారు. మొత్తమ్మీద 85.45 శాతం హాజరు నమోదైంది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో ఉన్న మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం వ్యాప్తంగా 5,793 మందికిగాను 4,822 మంది హాజరయ్యారు. పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్‌ నిరుల కళాశాల, విజ్ఞాన్‌ డిగ్రీ కళాశాల, ఆర్‌వీఆర్‌జేసీ కళాశాల, జీవీఆర్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాల, మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్‌ కళాశాల, కిట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాశారు.

కృషా ్ణ– గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి పోటీ పడుతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. కూటమి సర్కారులో పెత్తనం చలాయిస్తున్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, రెండు జిల్లాల్లో అన్నింటా ఆ వర్గీయులకే ప్రథమ ప్రాధాన్యం దక్కుతుండటం అంతటా చర్చనీయాంశాలు అయ్యాయి. ప్రధాన పోటీదారుడైన పీడీఎఫ్‌ అభ్యర్థి కె.ఎస్‌.లక్ష్మణరావుతో ఆలపాటి వ్యక్తిత్వం, అభ్యర్థిత్వం, నాయకత్వం, రాజకీయతత్వం తదితరాలను పట్టభద్రులైన ఓటర్లు బేరీజు వేసుకున్నప్పుడు ఎవరివైపు మొగ్గుతారనే అంతర్మథనం కూటమి వర్గాల్లో జరుగుతోంది. మరో వైపు సర్కారు వైఫల్యాలు కూటమి అభ్యర్థికి శాపాలుగా మారతాయనే ఆందోళన అధికమవుతోంది.

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి ఆలపాటికి సీటు ఇవ్వకుండా కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. సీటు త్యాగం చేశారనే మండలి ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లు ఆ పార్టీ అధిష్ఠానం చెబుతోంది. ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 అసెంబ్లీ, 5 లోక్‌సభ (బాపట్ల, ఏలూరు పాక్షికం) స్థానాల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారిలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు లేకపోలేదు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం మేం కష్టపడిన తీరు తెలుసు. మమ్మల్ని పార్టీ ఎలా వాడుకుందో కూడా తెలుసు. కొన్ని దాడులను ఎదుర్కొన్నాం. కేసులు నమోదు చేశారు. అయినా మా ‘త్యాగం’ గుర్తుకు రాకపోవడం బాధాకరం. మేం వారి సామాజిక వర్గీయులం కాకపోవడమే ఇందుకు కారణం కదా’ అనే ఆవేదన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బీసీ, ఓసీ నాయకులలో లేకపోలేదు.

సింహభాగం అవకాశాలు, పదవులు వారికేనా...

కృష్ణా, గుంటూరు జిల్లాలలో అధికభాగం అవకాశాలు, పదవులు చంద్రబాబు సామాజిక వర్గీయులకే దక్కుతున్నాయని, ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ అవకాశం ఇతర వర్గీయులకు ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న పార్టీ నాయకులలో ఆది నుంచీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోనూ ముఖ్య నాయకులు లేకపోలేదని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆలపాటికి అంతర్లీనంగా ప్రధాన అవరోధంగా మారనుందని రాజకీయ పరిశీలకుల అంచనా.

ఇటు గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌ (జనసేన), కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి సామాజిక వర్గీయులేనని గుర్తుచేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్‌... వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అటు కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), గద్దె రామ్మోహన్‌, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్‌, వెనిగండ్ల రాము, వసంత కృష్ణప్రసాద్‌, కూటమిలోని సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌, నాదెండ్ల మనోహర్‌లు సైతం ఆలపాటి సామాజిక వర్గీయులని పరిశీలకులు వివరిస్తున్నారు. ‘ఏమండీ అన్ని పదవులు మీ వారికేనా. ఇంకెవరూ అర్హులు లేరా? చిన్న పదవులు ఇతరులకు విదిల్చి ముఖ్యమైనవన్నీ మీకేనా’ అని ఓటరు ప్రశ్నించినట్టు ప్రచారంలో పాల్గొన్న ఆలపాటి వర్గీయుడు తెలిపారు.

7

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌సీపీ హయాంలో ...

వైఎస్సార్‌సీపీ హయాంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పదవుల పంపకాలలో ఇతర సామాజిక వర్గాలకు దక్కిన ప్రాధాన్యతను పట్టభద్రులు గుర్తుచేయడం టీడీపీ నాయకులకు మింగుడు పడడం లేదని సమాచారం. గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, విడదల రజని, కృష్ణా జిల్లా నుంచి కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాస్‌, జోగి రమేష్‌ మంత్రులుగా వ్యవహరించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు వంటి పదవులు ఇతర సామాజిక వర్గాలకు చెప్పుకోదగిన స్థాయిలో దక్కడాన్ని పరిశీలకులు గుర్తుచేసుకుంటున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్‌ నేతలకు కూడా సముచిత ప్రాధాన్యం దక్కింది.

గుంటూరు నుంచి ముగ్గురు మంత్రులు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు సైతం కృష్ణాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ అయిన ప్పటికీ ఆ సామాజిక వర్గానికే టీడీపీలో ప్రాధాన్యం శాసన మండలి ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశమిదే గత సర్కారు హయాంలో ఈ పరిస్థితుల్లేవని విశ్లేషణ కూటమి అభ్యర్థికి తలపోటుగా మారిన ‘సామాజికం’ ప్రభుత్వ వైఫల్యాలు మొదటికే మోసమంటూ హైరానా

ఆందోళన కలిగిస్తున్న కూటమి వైఫల్యాలు

సూపర్‌ సిక్స్‌ హామీల అమలు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూటమి అభ్యర్థికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలు హుళక్కే. నిరుద్యోగులకిచ్చిన మాటలు నీటిమూటలయ్యాయి. రైతుల సంగతి సరేసరి. అన్ని రంగాలు, అన్ని వర్గాల నుంచి పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న నేపథ్యంలో ‘ఆలపాటి పరిస్థితి ఏంటి’ అనేది అందరి నోటా వినిపిస్తున్న నేటి మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/8

పల్నాడు

పల్నాడు2
2/8

పల్నాడు

పల్నాడు3
3/8

పల్నాడు

పల్నాడు4
4/8

పల్నాడు

పల్నాడు5
5/8

పల్నాడు

పల్నాడు6
6/8

పల్నాడు

పల్నాడు7
7/8

పల్నాడు

పల్నాడు8
8/8

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement