దాచేపల్లి: రేపల్లె ఎక్స్‌ప్రెస్ రైలులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాలు.. ఆదివారం రేపల్లె నుంచి సికింద్రాబాద్‌కు రైలు బయలుదేరింది. మొదటి లగేజీ బోగీలో ఇనుపరాడ్‌కి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రయాణికులు గుర్తించారు. గార్డుకు సమాచారం ఇవ్వటంతో రైలును నడికుడి స్టేషన్‌లో నిలిపివేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు వెళ్లి పరిశీలన చేయగా దుప్పటితో ఉరేసుకుని వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని బాపట్ల జిల్లా చీరాల మండలం చిన్నగంజాంకి చెందిన బాలిగ రాంబాబు(43)గా గుర్తించారు. లారీ క్లీనర్‌గా పని చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో 15 నిమిషాలపాటు రైలును నడికుడి రైల్వేస్టేషన్‌లో ఆపారు.
Comments
Please login to add a commentAdd a comment