సమతావాది బాబూ జగ్జీవన్ రామ్
మాచర్ల: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మాచర్ల పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన ఎస్సీ, గిరిజన సంఘాల నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకుల తో కలిసి పీఆర్కే జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాతావాది బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు ఎనలేనివన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన పాటు పడ్డారన్నారు. ఆయన అడుగుజాడల్లో వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. జగ్జీవన్‌రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాచర్ల ఎంపీపీ కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాచర్ల సుందరరావు, బి.మరియమ్మ, కౌన్సిలర్లు సంతోష్, అల్లి జీవన్, ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.చంద్రశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర సభ్యుడు వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు


