కందిరీగల దాడిలో 15 మందికి గాయాలు
బాపట్ల :బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో గాయత్రీ అపార్టుమెంటు సమీపంలో కందిరీగలు దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో కందిరీగలు ఒక్కసారిగా పైకిలేచి ఆ ప్రాంతంలో వెళ్లే వారిపై దాడి చేశాయి. దాడిలో 15 మందికి గాయాలు కాగా వీరు ప్రభుత్వ వైద్యశాల్లో చికిత్స పొందుతున్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో అవకాశం
బాపట్ల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన పలువురికి అవకాశం కల్పిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి, జాయింట్ కార్యదర్శులుగా మాచవరపు రవికుమార్, షేక్ ఫర్‌వీజ్, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ విభాగం కార్యదర్శిగా ఇమానియేల్ రీభాలను ఎంపిక చేశారు. వీరు ఎంపికై న పలువురు అభినందనలు తెలిపారు.
తప్పిన ప్రమాదం
చీరాల: జాతీయ రహదారిపై పెనుప్రమాదం తప్పింది. గురువారం చిన్నగంజాం నుంచి చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి కుటుంబంతో కలసి ఆటోలో వెళుతుండగా చీరాలలోని జాతీయ రహదారిలో టీడీపీ కార్యాలయం వద్ద నీరు తాగేందుకు ఆటో నిలిపారు. అదే మార్గంలో వేరుశనగ లోడుతో వస్తున్న మినీ లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో అటో వేగంగా పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో అందరూ ప్రాణాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బాపట్ల టౌన్: ఇటీవల బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాపడిన రిటైర్డు రైల్వే ఉద్యోగి తులబందుల లక్ష్మీ నారాయణ(65) గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. లక్ష్మీనారాయణ, నల్లమోతు మాధవి గుంటూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. నల్లమోతు మాధవి బుధవారం మృతి చెందగా లక్ష్మీనారాయణ గురువారం మృతి చెందారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీరిరువురు జీవితాలు విషాదం కావటంతో వారి బంధువుల్లో విషాదం నెలకొంది.
కందిరీగల దాడిలో 15 మందికి గాయాలు


