నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

Apr 21 2025 7:59 AM | Updated on Apr 21 2025 7:59 AM

నేడు

నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

జెట్టిపాలెం(రెంటచింతల):జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల(ఏపీ మోడల్‌ స్కూల్‌)లో 6వ తరగతిలో ప్రవేశానికి 2025–2026 విద్యాసంవత్సరానికి మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె.పాపయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. మార్చి నెల 31లోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 21 న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు కనీసం పొందాల్సి ఉంటుందని వివరించారు.

కోడెదూడ వితరణ

అచ్చంపేట: విశ్వహిందూ పరిషత్‌ గోరక్ష విభాగ్‌ సహకారంతో మండలంలోని తాళ్లచెరువులోని ఆవుల సంఘ గోశాల వారిచే వ్యవసాయ అవసరాల నిమిత్తం గ్రామానికి చెందిన పెంటారెడ్డి చిన్నపరెడ్డి అనే రైతుకు నాలుగు సంవత్సరాల కోడెదూడెను ఆదివారం ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు తుమ్మా మర్రెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న గోశాలలో కోడెదూడలను వ్యవసాయ అవసరాల నిమిత్తం వాడుకునే వారికి ఉచితంగా ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా విశ్వహిందూ పరిషత్‌ గోరక్షా ప్రముఖ్‌ బాగవతుల రవికుమార్‌, సీనియర్‌ కార్యకర్త వీరభద్రయ్య, క్రోసూరు ప్రముఖ్‌ సిద్దు కామేశ్వరాచారి, అచ్చంపేట ప్రముఖ్‌ జలసూత్రపు తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి మహిళకు గిన్నిస్‌ రికార్డు

సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన మహిళ పాపిశెట్టి అనూష గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ ది రికార్డు ధ్రువీకరణ పత్రం అందుకుంది. విజయవాడకు చెందిన హలేల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ అగస్టీన్‌ పాస్టర్‌ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్‌ 7న 1,046 మంది విద్యార్థులు కలిసి గంట సమయంలో స్వరాలు వాయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీనిని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు వారు గుర్తించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానాన్ని కేటాయించారు. ఇటీవల హైదరాబాదులోని లైఫ్‌ చర్చిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 18 దేశాల నుంచి ప్రజలు హాజరయ్యారు. అనూషకు రికార్డు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధి ఆనంద్‌ రాజేంద్రన్‌, హలేల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఆగస్ట్టీన్‌, పాస్టర్‌ అనిల్‌ కుమార్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనూష మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, భర్త సహకారంతో ఇది సాధించానని ఆనందంతో చెప్పింది.

గోల్డెన్‌ ప్రైమ్‌ సిటీ బ్రోచర్‌ ఆవిష్కరణ

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో 12 ఎకరాలలో సీఆర్డీఏ అఫ్రూవల్‌తో వారాహి ఇన్‌ఫ్రా టౌన్‌షిప్స్‌ వారి గోల్డెన్‌ ప్రైమ్‌ సిటి బ్రోచర్‌ను ఆదివారం సంస్థ చైర్మన్‌ కొండవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్‌ దేవమిత్ర రాజా, అరుణ్‌ప్రశాంత్‌, సాయి ఆదిత్య స్కూల్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లక్కీడిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కారు, రెండు, మూడు బహుమతులుగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, టీవీఎస్‌ స్కూటీని విజేతలకు అందించారు. ఫ్లాట్‌ బుకింగ్‌ చేసిన ప్రతి ఒక్కరికీ 2 గ్రాముల గోల్డ్‌ కాయిన్‌ అందించారు. గతంలో కేఎస్‌ఆర్‌ డవలపర్స్‌ పెదపరిమి, గొర్లవారిపాలెంలో పంచాక్షరి గార్డెన్స్‌ దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జొన్నలగడ్డలో వారాహి ఇన్‌ఫ్రాజ్యూయల్‌ సిటి, విజయవాడలో నిడమానూరులో ఎంబసి విల్లాస్‌ పూర్తి కావస్తుందని నిర్వాహకులు తెలిపారు.

నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష   1
1/2

నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష   2
2/2

నేడు ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement