ఎం.రాజపురంలో ఈదురు గాలులకు నేలమట్టమైన అరటి పంట
పంటలు
పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు
ప్రాంతా ల్లో ఆదివారం అర్ధారాత్రి నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతా ల జలమయమయ్యాయి. అరటి, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. నువ్వుపంట నేలమట్టమైంది.
నూర్పిడిచేసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. వీరఘ ట్టం మండలంలోని వీరఘట్టం, దశుమంతపురం, చలివేంద్రి, చిట్టపులివలస, కంబర, నడిమికెల్ల, విక్రమపురం, నడుకూరు గ్రామాల్లో సుమారు
50 ఎకరాల్లో అరటి తోటలు, 250 ఎకరాల్లో జీడి మామిడి తోటలు ధ్వంసమయ్యాయని, సుమా రు రూ.50 లక్షల పంట నష్టం జరిగినట్టు రైతులు చెబుతున్నారు. పంటల నష్టం అంచనా వేస్తామ ని తహసీల్దార్ చందక సత్యనారాయణ తెలిపా రు. వేసవి దుక్కులకు వర్షం
ఉపకరిస్తుందని పలువురు రైతులు పేర్కొన్నారు.
– వీరఘట్టం/గుమ్మలక్ష్మీపురం/రేగిడి
వర్షార్పణం
వర్షార్పణం
వర్షార్పణం
వర్షార్పణం
వర్షార్పణం


