● ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు తరలించవద్దు
● యూపీ పాఠశాలలను కొనసాగించాలి
● యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో
కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ
● అక్కడ ఆందోళన
పార్వతీపురం టౌన్: ఊరిబడిని రక్షించాలని, ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రెడ్డి మోహన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం నుంచి కల్టెరేట్ వరకు ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌లు, విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వో హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, ఏ ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను తరలించ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూపీ పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని, తెలుగు, ఇంగ్లిష్, సమాంతర మీడియం కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయకుండా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.మురళీమోహన్‌రావు, కె.విజయగౌరి, జిల్లా నాయకులు టి.రమేష్, కె.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఊరిబడి రక్షణకు పోరుబాట
ఊరిబడి రక్షణకు పోరుబాట


