● వెల్ఫేర్‌డేలో విజ్ఙాపనలు స్వీకరించిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డేను ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ విజ్ఞాపనలు స్వీకరించి చర్యలు చేపట్టారు.
లివిరి సమీపంలో ఏనుగుల గుంపు
భామిని: మండలంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం మండలంలోని లివిరి పంట పొలాల్లో నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు నాఽశనం చేస్తున్నాయి. వంఽశదార నదీ తీరం వెంబడి ఏనుగుల గుంపు ప్రయాణం కొనసాగుతోంది. భామిని గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశిస్తుందని మండల కేంద్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఏనుగులు గుంపు పంటలన్నీ పాడుచేస్తున్నప్పటికీ అధికార కూటమి నాయకులు ఇచ్చిన హామీ మరిచి మౌనం వహించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పిచ్చి కుక్క కరిచి 9 మందికి గాయాలు
వీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని బార్నాలవీధి రోడ్డులో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చిన 9 మందిపై పిచ్చి కుక్క దాడి చేయడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కోట శ్రీరాములు, జి.నాగరాజు, ఎం.ధరణి, సుజాత, జి.పార్వతి, పి.రామిశెట్టి, కె.గంగులు, బి.ధర్మారావు, కె.రవి ఉన్నారు. వారందరికీ వీరఘట్టం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. వారిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రెండు బైక్‌లు ఢీకొని
యువకుడు మృతి
వేపాడ: మండలంలోని కొత్త బొద్దాం జంక్షన్‌లో గురువారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు ద్విచక్రవాహనం వెళ్తుండగా ఎల్.కోట నుంచి ఎస్.కోట వైపు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం కొత్త బొద్దాం జంక్షన్ దగ్గర ఢీకొన్నాయి. దీంతో ప్రమాదంలో రెండు వాహానాలపై ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న వాహనచోదకుడు బసవబోయిన కార్తీక్ (19) మృతిచెందాడు. ఎస్.కోట కోటవీధికి చెందిన కార్తీక్‌కు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు.
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు


