గర్జించిన గిరిజనం
–8లో
మా వాళ్లే.. ఉద్యోగం ఇచ్చేయ్..
కూటమి నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను ఇబ్బంది
పెడుతున్నారు.
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
సీతంపేట/పార్వతీపురం: కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుచేయకపోవడం, గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంపై గిరిజనులు గర్జించారు. ర్యాలీగా వచ్చి సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాలను శనివారం ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. పార్వతీపురంలో ఐటీడీఏ చాంబర్ వద్దనే ధర్నా చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను దుమ్మెత్తి పోశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలంటూ సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ ఏపీఓలు చిన్నబాబు, మురళీధర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఆందోళనలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం.తిరుపతిరావు, ఎం.లక్షణరావు, సీదారాపు అప్పారావు, ఎం.కృష్ణమూర్తి, వాసు, సీతారాం, రామారావు, రాము, సోములు, అనిల్, కె.సాంబమూర్తి, రాజశేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చేనెల 15న ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
డిమాండ్లు ఇవీ...
● ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి.
● అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా చెక్‌డ్యాంలు, చెరువులు నిర్మించాలి.
● గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి
నివారించాలి.
● సీతంపేట వంద పడకల ఆస్పత్రి వద్ద భవన నిర్మాణ పనులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి.
● గిరిజనులు పండిస్తున్న జీడి, చింతపండు, చీపురు తదితర పంటలకు మద్దతు ధర కల్పించాలి.
● కురుపాం, సాలూరు, సీతంపేట మండలాల్లో జీడి పిక్కల పరిశ్రమను, ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలి. 80 కిలోల జీడి పిక్కల బస్తాను రూ.16 వేలుకు కొనుగోలు చేయాలి.
● గిరిజన గ్రామాలకు తాగునీరు, బస్సు, రోడ్ల సదుపాయం కల్పించాలి. గిరిజనులు సాగుచేసిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.
● గిరిజన యువత ఉన్నత విద్యకు పీజీ, డైట్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి.
● కురుపాం, సాలూరు మండల కేంద్రాల్లో వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి.
● 3,4, 5 తరగతుల విద్యార్థులకు చదువును దూరం చేసే మోడల్ స్కూల్ పాఠశాల విధానాన్ని నిలుపుదల చేయాలి.
అటవీ ఉత్పత్తులు కొనుగోలు
వేగవంతం చేయాలి
పార్వతీపురం: గిరిజనుల ఆందోళనపై పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశోతోష్ శ్రీవాస్తవ స్పందించారు. జీసీసీ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల కొనుగోలును వేగవంతం చేయా లని, మద్దతు ధర చెల్లించాలని శనివారం ఓ ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
న్యూస్‌రీల్
గర్జించిన గిరిజనం
గర్జించిన గిరిజనం


