అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురంటౌన్: వేసవి కాలంలో ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్యరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు ఆదేశించారు. స్థానిక ఆరోగ్య కార్యాలయం నుంచి జూమ్ కాన్షరెన్స్‌లో వైద్యాధికారులు, 108 సిబ్బందికి శనివారం పలు సూచనలిచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాథమిక, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లను సిద్ధంగా ఉండాలన్నారు. బుధ, శని వారాల్లో నిర్వహించే టీకా కార్యక్రమాన్ని ఉదయం త్వరగా ప్రారంభించాలన్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వెర్టర్, బ్యాటరీల పనితీరు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి.జగన్‌మోహనరావు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కరరావు


