సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు

Mar 30 2025 3:54 PM | Updated on Mar 30 2025 3:54 PM

సమస్య

సమస్యల పరిష్కారానికి చర్యలు

కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఎ. శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు ఫిర్యాదులకు సంబంధించిన విచారణను శనివారం స్థానిక కలెక్టరేట్‌లో చేపట్టారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌ శోభిక, డీఆర్‌ఓ హేమలత, జిల్లా రిజిస్ట్రార్‌ పి. రామలక్ష్మి పట్నాయక్‌, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి పి. లక్ష్మణరావు, సంబంధిత తహసీల్దార్లు, ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేపట్టి, సమస్యలను పరిష్కరించారు.

జాతీయ స్థాయి పోటీలకు జ్యోత్స్న

విజయనగరం: గుంటూరులో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎ. జ్యోత్స్న అద్భుత ప్రతిభ కనబరిచింది. నెహ్రూ యువకేంద్ర సంఘటన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన డిబేట్‌లో ప్రథమ బహుమతి కై వసం చేసుకుని జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో కూడా రాణించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ మేరకు జ్యోత్స్నను కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ కేవీ ఉజ్వల్‌ శనివారం ప్రత్యేకంగా అభినందించారు.

బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

మెంటాడ: మండలంలోని కై లాం గ్రామానికి చెందిన ఇద్దరు బెట్టంగ్‌ రాయుళ్లను ఆండ్ర ఎస్సై కె. సీతారామ్‌ శనివారం అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేపట్టగా ఓ ఇంటిలో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు 1
1/1

సమస్యల పరిష్కారానికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement