అంతర్జాతీయ పోటీలకు కోమటిపల్లి యువకుడు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన దీసరి భానుప్రసాద్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్లు సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్‌బీకేఎఫ్) ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విశాఖలో జరిగిన పోటీల్లో పాల్గొన్న భానుప్రసాద్ మొదటి స్థానం సాధించాడని పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి 7 వరకు నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భానుప్రసాద్ తలపడనున్నాడన్నారు. ఇదిలా ఉంటే ప్రయాణ ఖర్చుల కోసం జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడి దుర్గాప్రసాద్ ఐదు వేల రూపాయలను భానుప్రసాద్‌కు అందజేశారు.


