147 కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. గడిచిన వారం రోజుల్లో భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్సీ వకుల్ జిందల్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా 147కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలానికి చెందిన బోగవిల్లి గోవిందరావు, సాగుపిల్లి అనిల్ కుమార్, బంక రామసురేష్, అంబిడి బాలరాజులు రామభద్రపురం మండలంలోని కొట్టక్కి జంక్షన్ వద్ద గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రామభద్రపురం పోలీసులు, ఆ నలుగురు నిందితులను అదుపులోకి ప్రశ్నించడంతో గంజాయి సరఫరా గుట్టు రట్టైందని ఎస్పీ చెప్పారు. దీంతో నిందితుల దగ్గర ఉన్న 147 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
పోలీసుల అదుపులో నలుగురు నిందితులు


