భామిని: మండలంలోని బిల్లుమడ రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భామిని మండలం బిల్లుమడకు చేరిన జంట ఏనుగులు ఘీంకరిస్తూ మంగళవారం వంఽశధార నదిని దాటాయి. ఇప్పటికే ఒడిశా గ్రామాల్లో మరో రెండు ఏనుగుల జట్టు వీడిన రెండు ఏనుగుల జంట కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. వంశధార నదీ తీరంలోని ఒడిశాకు చెందిన పురిటిగూడ–గౌరీ గ్రామాల మధ్య రెండు ఏనుగుల జంటలు కలిసి ఊరట చెందాయని స్థానిక రైతులు తెలిపారు.
రజక సంఘం పట్టణ నూతన కమిటీ ఎంపిక
విజయనగరం టౌన్: ఉమ్మడి విజయనగరం, జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో విజయనగరం పట్టణ నూతన కమిటీ ఎంపిక మంగళవారం కార్యాలయంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడిగా కోనాడ పైడిచిట్టి, ఉపాధ్యక్షుడిగా రామనేంద్రపు సురేష్, కార్యదర్శిగా కొవ్వూరి అప్పలరాజు, సహాయ కార్యదర్శిగా ముత్యాల సతీష్, కోశాధికారిగా జంపా నాగరాజు, కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అప్పికొండ సన్యాసిరావు, తంగేటి భాస్కరరావు, జంపా చిన్న, మడిపల్లి రాజారావు, సురేష్, శంకర్, రాజా, సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
100 సారా ప్యాకెట్లు స్వాధీనం
పార్వతీపురం రూరల్: పట్టణ పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టణంలో గల పాత రెల్లివీధిలో వంద సారా ప్యాకెట్లతో మీసాల శివకుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు టౌన్ ఎస్సై గోవింద మంగళవారం తెలిపారు.
విద్యుత్ షాక్‌తో వలస కార్మికుడి మృతి
సీతంపేట: మండలంలోని కిల్లాడ గ్రామానికి చెందిన వూయక రాహుల్ (20) అనే గిరిజన యువకుడు వలస వెళ్లి అక్కడ విద్యుత్ షాక్‌తో రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని కొద్ది నెలల కిందట మచిలీపట్నం వలసవెళ్లాడు. అక్కడ చేపల చెరువుకు కాపలాగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే గతనెల 31న చేపలచెరువుకు వెళ్లి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. కుమారుడి మృతివార్త విన్న తల్లిదండ్రులు తిరుపతిరావు,నీలమ్మలు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం కిల్లాడలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
వడదెబ్బతో వృద్ధురాలు..
వీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని ముచ్చర్లవీధికి చెందిన మంతిన గౌరమ్మ(85) వడదెబ్బతో మృతి చెందినట్లు వీధివాసులు తెలిపారు. వారం రోజులుగా ఎండల తీవ్రత ఎక్కుగా ఉండడంతోనే వృద్ధురాలు మృతి చెందిందని స్థానికులు అంటున్నారు. మంగళవారం ఉదయం పింఛన్ తీసుకున్న తర్వాత కొద్ది సేపటికే మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. ఆమెకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో వీధిలో ఉన్నవారే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
యువతకు స్ఫూర్తి భగత్‌సింగ్
విజయనగరం గంటస్తంభం: పాలకుల విధానాలపై, సామ్రాజ్యవాద దోపిడి పీడలకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ అని ఎన్‌వైఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.అప్పలరాజు అన్నారు. మంగళవారం నవయువ సమాఖ్య ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దురగతాలను వ్యతిరేకిస్తూ స్వయం పాలన సాధించాలని తిరుగుబాటు జెండాను ఎగరవేసి స్వాతంత్ర పోరాటంలో యువకులకు ఉరి తొలగించిన వ్యక్తి భగత్ సింగ్ అని గుర్తు చేశారు. సోషలిస్టు వ్యవస్థ లేని దోపిడి రహిత సమాజం ఏర్పడుతుందని నినదించిన వ్యక్తి భగత్ సింగ్ అని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కరరావు పాల్గొన్నారు.
వంశధార నది దాటిన జంట ఏనుగులు
వంశధార నది దాటిన జంట ఏనుగులు
వంశధార నది దాటిన జంట ఏనుగులు


