ప్రవేశాలకు ఆరాటం! | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలకు ఆరాటం!

Apr 2 2025 12:47 AM | Updated on Apr 3 2025 1:24 AM

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురంటౌన్‌: సాధారణంగా పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతనే ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు జరుగుతాయి. ఫెయిల్‌/పాస్‌ తేలిన తర్వాత.. వచ్చిన మార్కుల ఆధారంగా ఇష్టమైన సబ్జెక్టులో సీటు దొరుకుతుంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల పుణ్యమానీ ప్రవేశాల్లో పోటీ పెరిగింది. ఫలితాలు రాకుండానే ఇంటర్మీడియట్‌లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. రేటు బట్టి సీటు కేటాయింపు జరుగుతోంది. ఇప్పుడు ఆ జాఢ్యం ప్రభుత్వానికీ అంటుకున్నట్లు ఉంది. ఈ ఏడాది నూతన విద్యావిధానమంటూ ఇంటర్‌ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యాసంవత్సరంలో మార్పులు చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులను ఏప్రిల్‌ 1 నుంచే ప్రారంభించేశారు. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

7 నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నాం..

ప్రభుత్వం నిర్ణయం మేరకు మంగళవారం నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం ప్రవేశాలు ఈ నెల 7 నుంచి కల్పిస్తాం. టెన్త్‌ ఫలితాలతో సంబంధం లేకుండా హాల్‌ టికెట్ల ఆధారంగానే ప్రవేశాలు పొందవచ్చు. ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాలు బాగుంటాయి. అందరూ ఉత్తీర్ణులవుతారనే నమ్మకం ఉంది. సిలబస్‌లోనూ మార్పులు ఉంటాయి. విద్యార్థులకు టెక్ట్స్‌, నోట్‌ పుస్తకాలు కూడా అందజేయనున్నాం.

– మంజులవీణ, జిల్లా ఇంటర్‌ విద్య అధికారిణి

7 నుంచి

మొదటి

సంవత్సరం

ప్రవేశాలు

జిల్లాలో ఈ ఏడాది జనరల్‌, ఒకేషనల్‌, ప్రైవేట్‌ విద్యార్థులు కలిపి మొత్తం 9,335 మంది ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యారు. 10,363 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. వీరిలో ఎంతమంది ఉత్తీర్ణులవుతారో చూడాలి. పదో తరగతి రాసిన వారికి ఈ నెల 7 నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నారు. పది పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఫలితాలతో సంబంధం లేకుండా హాల్‌ టికెట్ల ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు. ఫలితాలు వెల్లడైనన తర్వాత పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైన వారిని తొలగిస్తారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవేళ విద్యార్థులను తొలగిస్తే వారి మానసిక స్థితి మీద ఆ ప్రభావం పడుతుందని ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఇంటర్‌ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, జూన్‌ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమయ్యేది. నూతన విధానం ఫలితంగా ఏప్రిల్‌ 1 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించి, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్‌ తరగతులను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 24 నుంచి మరలా వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

నూతన విద్యావిధానమంటూ ఇంటర్‌ విద్యలో సమూల మార్పులు

ఏడో తేదీ నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు

పదో తరగతి పరీక్షలు పూర్తి కాకుండానే హడావిడి

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు హాల్‌టికెట్‌తోనే ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశం పొందే వెసులుబాటు కల్పించడంతో ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆయా కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది ప్రవేశాల కోసం రోడ్డెక్కారు. ఆయా యాజమాన్యాలు కూడా సిబ్బందికి టార్గెట్లు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 52 వరకు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలు ఉండగా.. ఇక్కడి సిబ్బంది సైతం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరాలని పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రాథేయపడుతున్నారు. ఇంకా ఫలితాలు రాకుండానే విద్యార్థులను ఎలా, ఏ సబ్జెక్టులో చేర్చుతామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ప్రవేశాలకు ఆరాటం! 1
1/2

ప్రవేశాలకు ఆరాటం!

ప్రవేశాలకు ఆరాటం! 2
2/2

ప్రవేశాలకు ఆరాటం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement