దుర్గమ్మకు సంబర నీరాజనం
పాలకొండ రూరల్:
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఇష్టమైన ఆదివారాన్ని పురష్కరించుకొని పట్టణ, మండల పరిధిలోని భక్తులు సంబరాలను నిర్వహించారు. నూతన వధూవరులు ఘటాలు, ముర్రాటలు తలదాల్చి దేవస్థానానికి చేరుకున్నారు. అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, మనిల్‌కుమార్ శర్మ తదితరులు భక్తులు ఇచ్చిన కానుకలను అమ్మవారికి నివేదించారు.
రక్తదానంతో ప్రాణదానం
విజయనగరం టౌన్:
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు విడనాడి రక్తదానానికి ముందుకు రావా లని విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఇల్తామాష్ కోరారు. నగరంలోని బీసీ కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాలో రక్తం నిల్వల కొరత కారణంగా తలసీమియా పిల్లలు, గర్భిణుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రక్తదానం చేసిన 30 మందిని సత్కరించారు. శిబిరంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, శరత్, అశోక్, సాయి, రఘు, సాయిప్రసాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు సంబర నీరాజనం


