నేడు డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి
పార్వతీపురం టౌన్: భారత రాజ్యాగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఆస్తుల పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 16న ర్యాలీ
విజయనగరం టౌన్: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన భారీ ర్యాలీ కి సంబంధించి జిల్లా ముస్లిం సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆబాద్‌వీధిలో ఉన్న కార్యాలయంలో ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకుడు ఆబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేయడం దారుణమన్నారు. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం కలుగు తుందన్నారు. మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు షరీఫ్, ముస్తఫా, జాకీర్ హుస్సేన్, మొహమ్మద్ నిజాం, అన్సర్, చిస్తి తదితరులు పాల్గొన్నారు.
కనుల పండువగా
శ్రీవారి చక్రస్నానాలు
రాజాం : మండలంలోని అంతకాపల్లి గ్రామంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుని ఉత్స వ విగ్రహాలకు మిధున లగ్నంలో చక్రస్నానా లు నిర్వహించారు. కనుల పండువగా జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఏఈఓ జి. జగన్మోహన్‌ఆచార్య, ఆలయ పర్యవేక్షకులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
లలిత.. నీవే ఆదర్శం
● ఇంటర్ బైపీసీలో సత్తా చాటింది
● ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కై వసం
నెల్లిమర్ల: నిరుపేద కుటుంబంలో పుట్టిన లలిత నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. తమ స్వగ్రామం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యాభ్యాసం కోసం చేరింది. ఇక్కడే ఉన్న ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతిగృహంలో ఉంటూ కళాశాలకు ప్రతిరోజూ నడిచి వెళ్లేది. కష్టం అయితేనేం ఇష్టపడి చదివింది. తాను అనుకున్నది సాధించింది. తాజాగా శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. బైపీసీ గ్రూపులో 989 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదీ నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత సాధించిన ఘనత. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బర్ల లలిత తల్లిదండ్రులు సంగమేష్ , సుశీల ఇద్దరూ వ్యవసాయ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. పదో తరగతిలో 504 మార్కులు సాధించిన లలితను కార్పొరేట్ కళాశాలలో చదివించే స్థోమత వారికి లేదు. అందుకే దూరమైనా సరే వసతిగృహం అందుబాటులో ఉన్న నెల్లిమర్ల ప్రభుత్వ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేర్పించారు. గతేడాది ఫస్ట్ ఇయర్ కూడా లలిత స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇప్పుడు 989/1000 మార్కులు సాధించి, ప్రభుత్వ కళాశాలల విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచింది.
నేడు డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి
నేడు డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి


