![12th Anniversary To YSRCP - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/10/SAJJALA-1.jpg.webp?itok=rsUndSU-)
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకొని మార్చి 12వ తేదీన 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత 11 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చేసి ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారని చెప్పారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్టీ జెండాలు ఎగుర వేయాలని కోరారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు రంగులు వేసి, పూలమాలలతో అలంకరించాలని, పలు సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment