
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం సినీ నటుడు చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి ఈ సందర్భంగా సోము వీర్రాజుకు అభినందనలు తెలిపి పుష్పమాల, శాలువాతో సత్కరించారు. సోదరుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment