సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. నిన్న రాత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా.. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కాగా, గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. ఇక, ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సరితా తిరుపతయ్యతో రేవంత్ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment