
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. ఉప ఎన్నికలు జరిగిన దిన్హత, గోసబా, ఖర్దహా, శాంతిపూర్ నాలుగు నియోజకవర్గాల్లో అధికార తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ నాలుగు స్థానాల్లో ఓటమిపాలు కాగా ఏకంగా మూడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఈ విజయం ప్రజల విజయం. విద్వేషంతో రాజకీయం చేసేవారిని కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే టీఎంసీని బెంగాల్ ప్రజలు ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బెంగాల్‌ను అన్ని రంగాల్లో ఉన్నతస్థానంలో నిలుపుతాము’ అని సీఎం మమతా ట్విటర్‌లో పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ, సీపీఐ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడ్డాయని ట్వీటర్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment