గాంధీ నగర్, సాక్షి : లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్‌దార్ తన పదవికి రాజీనామా చేశారు. వడోదర జిల్లా సావ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి అందించారు.
కేతన్ ఇనమాదార్ 2020 లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దానిని స్పీకర్ ఆమోదించలేదు. సీనియర్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు తనను, తన నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. బీజేపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తనలాగే నిరాశ చెందుతున్నారని ఇనామ్‌దార్ నాడు పేర్కొన్నారు.
ఇక కేతన్ ఇనామ్‌దార్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. అయితే బీజేపీలోకి చేరి 2017,2022లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మే 7న పోలింగ్
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 సీట్లలో ప్రస్తుతం బీజేపీకి 156 ఉన్నాయి. 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment