సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన..ఎన్నికలు అయిన వెంటనే..లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబుది మనిషి పుట్టుకేనా? ఆయన పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. ఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలనిసూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరని ప్రశ్నించారు. రియింబర్స్‌మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరని నిలదీశారు.
వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలని తెలిపారు. పింఛను లబ్ధిదారులు వారికి కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టాలని, 15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. భవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్సనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రైల్వేజోన్‌పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ, టీడపీ, జనసేన తోడు దొంగలు ఎద్దేవా చేశారు. ఒకరు తానా అంటే ఇంకొకరు తందనా అంటున్నారని సెటైర్లు వేశారు. ప్రధాని మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదని అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు.
ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి..దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదని అన్నారు మంత్రి బొత్స. తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోడీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో వస్తుందని చురకలంటించారు. కేంద్రంలో తమ పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment