హైదరాబాద్,సాక్షి : తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. కానీ నేతలు మాత్రం ఇంఛార్జి నియామకం జరగలేదని అంటున్నారు. దీంతో తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఎవరనే అంశం చర్చకు దారి తీసింది.
హైదరాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి హోదాలో అభయ్ పాటిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చారు. అభయ్ పాటిల్ నియామకం జరగలేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
దీంతో రాష్ట్ర ఇంఛార్జిగా హోదాలో పార్టీ పంపితేనే తాను సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానని సభా వేదికపై అభయ్ పాటిల్ తెలిపారు. పార్టీ ఎక్కడికి పంపినా తాను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని..సొంతంగా తాను ఇక్కడికి రాలేదని అభయ్ పాటిల్ స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా అభయ్ పాటిల్ ఫోటోతో పేరు సైతం ఉండడంతో కమలం శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.
స్పష్టత ఇచ్చిన కిషన్ రెడ్డి
గత వారం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా తరుణ్ ఛుగ్ స్థానంలో కర్ణాటక బీజేపీ నేత అభయ్ పాటిల్‌ను అధిష్టానం నియమించిందని వార్తలు వచ్చాయి. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా అభయ్ పాటిను నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయని, కానీ కేంద్ర అధిష్టానం ఎవరిని నియమించలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment