వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు వరంగల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్’ను ప్రకటించారు. దీనిని కాంగ్రెస్ తప్పకుండా అమలు చేస్తుందని రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో ఉన్న అంశాలివీ..
- ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ
- భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం
- ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం
- వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంట లకు మెరుగైన గిట్టుబాటు ధర.. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు.
- మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేం దుకు చర్యలు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు.
- మెరుగైన పంటల బీమా పథకం అమలు. శరవేగంగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహా రం అందించేలా ఏర్పాట్లు. రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు.
- వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం.
- పోడు భూములు, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన.
- రైతుల పాలిట శాపంగా మారిన ’ధరణి’ పోర్టల్ రద్దు. అన్ని రకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు.
- రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రేతలపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్ కింద కేసులు. సదరు సంస్థలు, వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి నష్టపోయిన రైతులకు అందించేలా నిబంధనలు.
- అవినీతికి తావు లేకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి.
- రైతు హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో ‘రైతు కమిషన్’ ఏర్పాటు.
- భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటల ప్రణాళిక. వ్యవసాయాన్ని పండుగగా మార్చేలా ప్రణాళికలు.
- పంటలకు గిట్టుబాటు ధరల కల్పన.
Comments
Please login to add a commentAdd a comment