ప్రతి హామీని అమలు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క | Deputy CM Bhatti Vikramarka Comments On BRS Party | Sakshi
Sakshi News home page

ప్రతి హామీని అమలు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Published Wed, Jul 3 2024 3:30 PM | Last Updated on Wed, Jul 3 2024 4:16 PM

Deputy CM Bhatti Vikramarka Comments On BRS Party

సాక్షి, హైదరాబాద్‌: ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నాం.. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం’’ అని భట్టి అన్నారు.

రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని భట్టి తెలిపారు.

ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలి. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్‌తో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యాడు.’’ అని  భట్టి ప్రశ్నించారు.

‘‘క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్‌వి కల్లిబొల్లు కబుర్లే. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. పుట్టింది బతకడానికి.. చావడానికి కాదు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement