సాక్షి, విజయవాడ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఏపీ, తెలంగాణలో మైక్‌లు మూగబోయాయి. ఎల్లుండి(సోమవారం) పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీవ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు.
ఏపీలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 74. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడనున్నారు.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడనున్నారు.
ఏపీ: రేపు పోలింగ్ కేంద్రాలకు చేరనున్న ఈవీఎంలు
- 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కి ఏర్పాట్లు
- 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు
- రాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్ కాస్టింగ్ కి ఏర్పాట్లు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
- 74.70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
- 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థుల పోటీ
- 417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ
- 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ
- 2,154 మంది పురుష అభ్యర్థులు, 231 మహిళా అభ్యర్థులు పోటీ
- ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 4 కోట్ల 14 లక్షల 1887 మంది ఓటర్లు
- ఏపీలో మహిళా ఓటర్లే అధికం
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మహిళా ఓటర్లు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 3 లక్సల 39వేల మంది పురుష ఓటర్లు
- ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు
- సోమవారం 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగింపు
- రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో 4 గంటలకు ముగియనున్న పోలింగ్
- ఎన్నికల విధులకు 5 లక్షల 26 వేల మంది సిబ్బందిని నియమించిన ఎన్నికల కమిషన్
- పోలింగ్ నాడు ఉదయం 7 గంటలలోపు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు
- అన్ని నియోజకవర్గాల్లోనూ అమలులోకి వచ్చిన 144 సెక్షన్
- 48 గంటల పాటు మద్యం షాపులు, బార్లు మూసివేత
- రాజకీయ పార్టీల బల్క్ మెసేజ్ ల ప్రచారాన్ని నిషేధించిన ఈసీ
- ప్రచారానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వెల్లిపోవాలని పోలీసుల ఆదేశం
- పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు భారీగా బందోబస్త్ ఏర్పాటు చేసిన ఈసీ
- ఏపీ పోలీస్ తో పాటు తమిళనాడు, కర్నాటక, ఏపీఎస్పీ, ప్రత్యేక దళాలు మోహరింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ప్రచార పర్వం
- రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
- 17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు
- రేపు రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని అనుమతిచ్చిన ఈసీ
- 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్
- పోలింగ్ పెంచేందుకు 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 45 మంది అభ్యర్థులు
- ఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ
- 160 కేంద్ర కంపెనీల CAPF బలగాలు రాష్ట్రంలో మోహరింపు
- ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలు
- రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లు
- పురుష ఓటర్లు-1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు
- 18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలు
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలు
- అత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు
- 1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీ
- జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు
Comments
Please login to add a commentAdd a comment