ఢిల్లీ: త్వరలోనే జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అక్కడ పరిస్థితులు సాధారణంగా ఉంటే తాను లోక్‌సభలో హామీ ఇచ్చినట్లు రాష్ట్ర హోదా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శనివారం వర్చువల్ విధానంలో జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల ఖరారు కోసం డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పిన అమిత్ షా.. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో జమ్మూ కశ్మీర్‌కు పర్యాటకులు వస్తున్నారని, ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలు నేరుగా లబ్ధిపొందుతున్నారన్నారు. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, 2019లో జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైన దగ్గర్నుంచీ అక్కడ ఎన్నికలు జరపాలని, అదే సమయంలో రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల కోసం, రాష్ట్ర హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఇక్కడ చదవండి: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’
Comments
Please login to add a commentAdd a comment