
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీకి మాజీ మంత్రి కుతూహలమ్మ.. ఆమె కుమారుడు, జీడీ నెల్లూరు నియోజకర్గ టీడీపీ ఇన్‌చార్జ్ హరికృష్ణ రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి రాజీనామా లేఖలు పంపించారు. లేఖలో అనారోగ్యం కారణంగా పేర్కొన్నప్పటికీ.. పార్టీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వనందుకు నిరసనగా ఆమె రాజీనామా చేసినట్టు సమాచారం. ఇద్దరు ప్రధాన నేతలు టీడీపీకి రాజీనామా చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment