
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టుల ద్వారా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు.
సోషల్ మీడియా కోఆర్డినేటర్లను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీనిపై పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు..
Comments
Please login to add a commentAdd a comment