సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్‌రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ దగ్గర బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న హరీశ్‌రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌నేతలు కలిశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు(శుక్రవారం) బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు.
ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ.. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్‌ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment