ప్రజా పోరాటాలతో వెనక్కితగ్గుతున్న సీఎం
సిద్దిపేట దీక్షా దివస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నా రా? ఉద్యమంలో ఒక్క కేసైనా ఉందా? ఒక్కనాడైనా అమరులకు పూ లు వేశారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. అలుగునూరులో కేసీ ఆర్‌ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్లు తుడుస్తావా? లేదా తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచి వేస్తావా?’అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేస్తూ శుక్రవారం సిద్దిపేటలో దీక్షా దివస్‌ను చేపట్టారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. లగచర్లలో గిరిజనులు తిరగబడితే వెనక్కి తగ్గారని, హైదరాబాద్‌లో హైడ్రా, మూసీలపై పేదలు తిరగబడటం, పోరాటాల ఫలితంగా రేవంత్ వెనక్కి తగ్గారన్నారు. డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనను ఆంధ్రవారికి తలొగ్గి కేంద్రంలోని కాంగ్రెస్ డిసెంబర్ 23న వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే సీఎం రేవంత్ రెడ్డి, కిషన్‌రెడ్డి చేయలేదని హరీశ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని మండిపడ్డారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు.
ప్రజావ్యతిరేక సర్కార్‌ను గద్దె దించుదాం
కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో ఈ ప్రజావ్యతిరేక సర్కారును గద్దె దించేవరకు రైతులు, యువకులు, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొందరు దొంగలు పారీ్టలోకి వచ్చి పందికొక్కుల్లాగా తిని వెళ్లిపోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణను కాపాడాలని ఆ రోజు కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఇకపై అలాంటి వారికి పారీ్టలో చోటు ఉండదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులరి్పంచారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో చేసిన దీక్షలు, ఆందోళన ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment