
హుజూరాబాద్(కరీంనగర్): హుజూరాబాద్ నియోజకవర్గానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఓట్లు అడుగుతారని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని అడిగారు. పెట్రోల్‌ధర పెంచామని ఓట్లు అడుగుతారో.. ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతున్నందుకు ఓట్లు అడుగుతారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఆదివారం మండలంలోని సింగాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన యువ చైతన్య సంఘం,ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన వాల్మీకీ బోయ సంఘం నేతలు,జమ్మికుంట మండలం నగురం గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా.. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతేడాది వ్యవసాయ పనులకు ట్రాక్టరు కిరాయి ఎకరానికి రూ.3వేలు ఉంటే.. నేడు రూ.5వేలు అడుగుతున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ రూ.5వేలు రైతుబంధు కింద రైతులకు ఇస్తే డీజిల్‌ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రూ.2,500 వసూలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీచేశామని, త్వరలో మరో 50నుంచి 60వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏమీలేదని,ఇక్కడ అభివృద్ధి మాత్రం కుంటుపడుతుందని తెలిపారు. గడియారాలు, కు ట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను పంచుతూ ఈటల హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారని అన్నారు.
చదవండి: దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం: మంత్రి హరీశ్ రావు
Comments
Please login to add a commentAdd a comment