అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు పేట్రేగి పోతున్నారు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా చేస్తామని ఎమ్మెల్యే శ్రావణి అనుచరుడు, టీడీపీ నేత నరసింహ యాదవ్ వీఆర్వోకు ఫోన్‌లో బెదిరించారు. ప్రస్తుతం నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మేం.. ఎమ్మెల్యే మనుషులం..ఇసుక అక్రమ రవాణా చేస్తాం. ఇసుక అక్రమ రవాణాకు పోలీసుల సహకారం ఉంది. మీరు అడ్డుకుంటే అంతు చూస్తామంటూ రాచేపల్లి వీఆర్వో నాగేంద్రకు టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చాడు.
ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి నరసింహ యాదవ్.. వీఆర్వోను బెదిరించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment