జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల | Jammu And Kashmir Assembly Polls: BJP Announces 1st List Of Candidates | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

Published Mon, Aug 26 2024 10:32 AM | Last Updated on Mon, Aug 26 2024 12:46 PM

Jammu And Kashmir Assembly Polls: BJP Announces 1st List Of Candidates

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సోమవారం ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. మొదట తొలి జాబితాలో భాగంగా మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.  అనంతరం కొంత సమయం తర్వాత ఆ జాబితాను బీజేపీ ఉపసంహరించుకుంది.  మళ్లీ తిరిగి కేవలం 15 మంది అభ్యర్థుల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది.

 

జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement