
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కాగా, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విషపూరిత రాజకీయాలకు చంద్రబాబు చిరునామా. రాళ్లు విసిరించుకోవడం బాబుకు సాధారణమే. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే. ఈ నాటకానికి తెరతీసింది చంద్రబాబే. ఆయన ఓ కుసంస్కారి. 4 బస్సులు తగలబెట్టకుంటే అది బంద్ కాదన్నది చంద్రబాబే.
పార్ట్-1లో పవన్ మీద రెక్కీ అని హడావుడి చేశాడు. అది తాగుబోతులు చేసిన వీరంగం అని తేలింది. పార్ట్-2లో రాయి వేసినట్టు హడావుడి చేస్తున్నాడు. రాయి ఎవరితో వేయించుకున్నాడో కూడా తేలుస్తాము. అప్పట్లో మల్లెల బాబ్జికి కత్తి ఇచ్చి పంపిందెవరో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబు చరిత్రంతా ఇలాంటి కుట్రలే. ఇప్పుడు నందిగామ వెళ్లేలోపే రాయి వేయించుకునే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. రేపు ఇప్పటంలో పవన్ పార్ట్-3 మొదలుపెడతాడు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment