బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం రేవంత్ తీరును ఎండగడుతూ వాగ్బాణాలు
సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా వరుస పోస్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ‘రూ. లక్షన్నర కోట్ల మూసీ ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీఫ్ మినిస్టర్’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డిని నిందిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆదివారం సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘గుండెలు పగిలి గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆవేద నతో, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోది స్తోంది. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరా లను నిర్మించి కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నాన ని ఓ తల్లి... అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు కు ఎలా పోతామని మరో తండ్రి గుండెలు బాదు కుంటున్నారు.
ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమోనని ఓ తల్లిఆత్మహత్య చేసుకుంది. భార్య కడుపుతో ఉందన్నా కనికరించరా? అని ఓ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నాసి ఇప్పుడు ఎక్కడ పన్నావ్? నాడు అలా – నేడు ఇలా.. నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావ్’అని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజమె త్తారు. ప్రజలు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని.. కోర్టులు, బీఆర్‌ఎస్ అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు.
బావమరిదితో నోటీసు ఇప్పిస్తే..
అమృత్ టెండర్ల అంశంలో తాను చేసిన ఆరో పణలపై సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బావ మరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తానని అనుకుంటున్నావా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూ స్తూ ఊరుకోము’అని వ్యాఖ్యానించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలోనే ఆయన బావమరిది శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్ట బెట్టింది నిజమన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13ని సీఎం ఉల్లంఘించారని ఆరోపించారు. శోధ గత రెండే ళ్లుగా కేవలం రూ. 2 కోట్ల లాభాన్నే ఆర్జించిన ఓ చిన్న కంపెనీ అన్నారు. ‘ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమే. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్‌గా దొరి కావు.. రాజీనామా తప్పదు’ అని పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment