KTR Emotional After Son Himanshu Leaves Abroad For Higher Studies - Sakshi
Sakshi News home page

నిన్న, మొన్నటి వరకు అల్లరి పిల్లాడు, ఇవాళ.. తండ్రిగా భావోద్వేగం

Published Sun, Aug 20 2023 11:39 AM | Last Updated on Sun, Aug 20 2023 12:38 PM

KTR Emotional After Son Himanshu Leaves Abroad For Higher Studies - Sakshi

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించి భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు కల్వకుంట్ల హిమాన్షు రావు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారాయన. 

నిన్న మొన్నటి వరకు కళ్ళముందే అల్లరిగా ఉండే ఈ పిల్లాడు పెరిగి, కాలేజీకి వెళ్లడాన్ని నమ్మలేకపోతున్నా. నాలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడు అంటూ కొడుక్కి సంబంధించిన చిన్ననాటి నుంచి ఫొటోలను ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేశారాయన. 

తాను కూడా ఫ్యామిలీతో కలిసి వారం పాటు అమెరికాలో ఉంటానని, పనిలో పనిగా తాను కూడా తన విధుల్ని నిర్వహిస్తానని తెలిపారాయన.కేటీఆర్ వెంట ఆయన భార్య, కుమారుడు హిమాన్షు వెళ్లారు. పర్యటన చివర్లో హిమాన్షును అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు. మరోవైపు హిమాన్షు కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెట్టుబడుల కోసం న్యూయార్క్, చికాగోలో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement