
సాక్షి, జగిత్యాల: తెలంగాణ బీజేపీలో పెను మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అధిష్టానం మార్చడం కారణంగా పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జిల్లాల స్థాయిలోని కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, బండి సంజయ్ మార్పు నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని కథలాపూర్ మండల ప్రజాప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేశారు. తక్కళ్లపల్లి సర్పంచ్ లక్ష్మితో పాటు, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు, లక్ష్మి భర్త శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు సంయమనంగా ఉండాలని సంజయ్ కోరారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించే పనులు చేయవద్దని తెలిపారు. ఇక, తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. రేపు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నట్టు వెల్లడించారు. అనంతరం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఇక, సంజయ్‌కి ఏ పదవి ఇస్తారన్న దానిపై బీజేపీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం.
ఇది కూడా చదవండి: బీజేపీలో మరో బిగ్ ట్విస్ట్.. కోమటిరెడ్డికి జాతీయ పదవి
Comments
Please login to add a commentAdd a comment