Minister Botsa Given Brilliant Reply For Pawan Kalyan - Sakshi
Sakshi News home page

‘పవన్‌.. నీకు ఇచ్చే 7 లెస్సెన్స్‌ అసైన్‌మెంట్‌ ఇదే’

Published Sun, Jul 23 2023 10:04 AM | Last Updated on Sun, Jul 23 2023 12:12 PM

Minister Botsa Gives Brilliant Reply For Pawan Kalyan - Sakshi

ఏదో ప్రశ్నించాలి కాబట్టి ఏదో ఒకటి అడిగేద్దాం..  ఊగుతూ మాట్లాడి నోరు పారేసుకుందాం అనే రీతిలో రెచ్చిపోతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు మంత్రి బొత్స  సత్యనారాయణ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు. తాను ఈ రోజు నుండి పవన్‌ కళ్యాణ్‌ వద్ద ట్యూషన్‌ తీసుకుంటాను.. కానీ ఏకైక షరతు ఏమిటంటే మీరు హోమ్‌వర్క్‌ చేస్తానని హామీ ఇచ్చారు.. అందుకోసం మీకు నేను ముందుగా ఒక అసైన్‌మెంట్‌ ఇస్తున్నాను, మీరు ఈ ఏడు పాఠాలను క్షుణ్ణంగా చదవడమే నేటి అసైన్‌మెంట్‌ అంటూ పవన్‌ ట్వీట్‌కు బొత్స దిమ్మ తిరిగే రీతిలో రిప్లై ఇచ్చారు.  ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ పవన్‌ చేసిన ట్వీట్‌కు బొత్స గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

డియర్‌ పవన్‌ కళ్యాణ్‌..  ముందు ఇవి తెలుసుకోండి

1: పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లకు సంబంధించినంత వరకూ అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని అందించిన ప్రపంచంలోని ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని తెలుసుకోండి.

2: రూ. 100 కోట్లకు పైబడిన ఏదైనా ప్రభుత్వ టెండర్ యొక్క పరిధిని మరియు అర్హతను ఖరారు చేయడం హైకోర్టు సమ్మతితో నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి ( జస్టిస్ శివశంకర్ రావు) చేత ఫైనలైజ్‌ చేయబడుతుంది.

 3: టెండర్ స్పెసిఫికేషన్‌లు పబ్లిక్ డొమైన్‌లో  ఉంచుతాం.  అదే సమయంలో వాటిపై ప్రతిస్పందించడానికి 21 రోజుల సమయం ఇవ్వబడుతుంది.  ఆపై ఇందుకోసం నియమించబడ్డ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత ‍టెండర్‌ స్పెసిఫికేషన్‌ అనేది లాక్‌ చేయబడుతుంది. 

4: టెండర్ల స్పెసిఫికేషన్‌లో ప్రపంచంలో న్యాయపరమైన సమీక్ష కల్గిన ఏకైక ప్రభుత్వం మాది అని గొప్పగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము,. ఈ తరహా విధానం వలన కంపెనీలకు సమ న్యాయం జరగడమే కాకుండా అవి సక్సెస్‌ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. 

5: అలాగే, ప్రాథమిక గూగుల్‌(Google)  సెర్చ్‌ అనేది మీకు ఈ నిర్దిష్ట టెండర్ కోసం ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్న అన్ని కంపెనీల వివరాలను అందిస్తుంది (ఆగస్టు 2022 నుండి పబ్లిక్ డొమైన్‌లో ఉంది!) కానీ లింక్‌ను మళ్లీ ఇవ్వడం వల్ల దాన్ని మీరు మళ్లీ మిస్‌ అయ్యే అవకాశం ఉండదు.

లింక్‌ క్లిక్‌ చేయాలనుకుంటే..

6:  ఏపీ విద్యా రంగానికి సంబంధించినంతవరకు, ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఫలితాలు వెలువడే అత్యంత పారదర్శకమైన విభాగం మాది అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము.

 7:  ప్రతీసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయం.  అది చూసి నాకు కూడా జాలేస్తోంది .  మీ మెదడులో పదును పెంచేందుకు నేను ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement