
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలోనే అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగాలు అడిగిన యువకులను నక్సలైట్ల పేరుతో కాల్చిచంపారని ఆరోపించారు. చంద్రబాబు దారుణాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పేరుతో నిరుద్యోగుల నోట్లో చంద్రబాబు మట్టికొట్టారని దుయ్యయబట్టారు.
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత సైతం ఫైర్ అయ్యారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు తిరస్కరించారని.. ఆయన రాజకీయాలు ఇక్కడ నడవవు’ అని అన్నారు.
చదవండి: చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment