సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పోటీ కానీ, సాటి వచ్చే వారు కానీ లేరని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరన్నారు మంత్రి.
కృష్ణాజిల్లా నీటిపారుదల సలహామండలి 38వ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ‘గత నాలుగేళ్లుగా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. జలాశయాలన్నీ కళకళలాడాయి. రైతులకు మంచి దిగుబడి వచ్చింది. ఎవరూ ఇవ్వనంతగా రైతులకు గిట్టుబాటు ధరను సీఎం ఇచ్చారు. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆశిస్తున్నాం. జూన్ 7 వ తేదీన కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేస్తున్నాం’ అని అన్నారు. కాలువల్లో గుర్రపుడెక్క, తూటుకాడను తొలగించేందుకు టెండర్లు పిలిచామని, రూ. 30 కోట్లతో పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్ పులిచింతలకు శంకుస్థాపన చేసిన పనులు కూడా పూర్తి చేశారన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని, ప్రారంభోత్సవం చేసుకునే రోజులు అతి త్వరలోనే ఉన్నాయన్నారు మంత్రి జోగి రమేష్.
అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను జనం చించి చేతిలో పెట్టారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడో ప్రజలకు తెలుసు. 14 ఏళ్ల సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క పథకమైనా తాను చేశానని చెప్పగలడా?, చంద్రబాబు, లోకేష్‌ల పనైపోయింది. 2024లో చంద్రబాబు దుకాణం సర్దుకోవాల్సింది’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment