సాక్షి, హైదరాబాద్: ఈసారి ప్రభుత్వం ఏర్పాట య్యాక తెలంగాణలో సామాజిక మౌలిక సదుపా యాలపై దృష్టి పెడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ముఖ్యంగా పర్యాటక శాఖకు పెద్దపీట వేయాలనుకుంటున్నామన్నా రు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే, లేనిపక్షంలో ఆ యన్ని బతిమాలుకునైనా.. వచ్చే ఐదేళ్లు తా ను పర్యాటక మంత్రిగా ఉంటానని అన్నా రు.
తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కొత్త రిజర్వాయర్లు కనిస్తుండటం, వాటి పరిసరాల్లో చాలా ఉపాధి అవకాశాలుండటమే ఇందుకు కారణమని తెలిపారు. శుక్రవారం ఐటీసీ కాకతీయలో బిజినెస్ నెట్‌వర్క్‌ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఇప్పటివరకు అభివృద్ధి ట్రైలరే..
‘తెలంగాణలో మెడికల్, ఆధ్యాత్మిక టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం వంటి వాటి ల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులు అవసరం లేకుండానే పీపీపీ పద్ధతిలో మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉన్న దృష్ట్యా తెలంగాణకు చెందిన ఔత్సాహి క పారిశ్రామిక వేత్తలు ఈ రంగంలో ఉన్న అవకాశా లపై దృష్టి పెట్టాలి.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్ప టివరకు మేము చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే. మున్ముందు అభివృద్ధి రుచి అందరికీ చూపిస్తాం. హైదరాబాద్‌ను థియేటర్ డిస్ట్రిక్ట్‌గా చే స్తాం. సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చెందుతున్నట్టే, మా అభివృద్ధి వెర్షన్ కూడా అప్‌డేట్‌తో సిద్ధంగా ఉంది. తెలంగాణ ‘3.ఓ వర్షన్’డెవలప్‌మెంట్‌కు ఐకాన్‌గా నిలుస్తుంది..’అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆరున్నరేళ్లలో ఐదు విప్లవాలు
‘రాబోయే ఐదేళ్లలో ప్రధానంగా ఐదు రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించేందుకు ప్రణాళిక లు సిద్ధం చేశాం. పర్యాటక, క్రీడా, విద్య–నైపుణ్యం, వైద్యారోగ్యం, ఐటీ వంటి విభాగాలు ప్రాధాన్యతలో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి దేశ, విదేశాల్లో ఉన్న వారికి, సెలబ్రెటీలకు అర్థమవుతుంటే.. స్థానిక ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదు.
తెలంగాణ సాధించిన తర్వాత కరోనా మినహా మాకు దొరికిన ఆరున్నరేళ్లలో 5 విప్లవాలను సాధించాం. మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంతో గ్రీన్ రెవె ల్యూషన్ సాధ్యమైంది. ఫిషరీస్‌కు తెలంగాణ అడ్డాగా మారింది. 46 వేల చెరువులు, నీటి వసతుల ద్వారా టన్నుల కొద్దీ చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. తద్వారా నీలి విప్లవం సాధించాం.
ఒక్క సిరిసిల్లలోనే ఆక్వా హబ్‌లో సుమారు 5 వేల ఉద్యోగాలు సృష్టించబోతున్నాం. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ స్థానంలో ఉన్నాం. తద్వారా పింక్ రివెల్యూషన్ సాధ్యమైంది. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా వైట్ రెవెల్యూషన్ సాధ్యమైంది. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పా మాయిల్ పండిస్తున్నాం. తద్వారా ఎల్లో రెవెల్యూషన్ కూడా సాధ్యమైంది..’అని వివరించారు.
కేటగిరీల వారీగా అందరికీ ప్రోత్సాహం
‘పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. కొత్తగా వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ అడ్డాగా మారనుంది. మన దగ్గర విశేష సేవలందిస్తున్న టీహబ్, వీహబ్, టీవర్క్స్, టాస్‌్క, టీఎస్‌ఐసీ, రీచ్ వంటి వ్యవస్థల ద్వారా ఎంతోమందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. దళితులు, మహిళలు, దివ్యాంగులు, పేదవారు ఇలా కేటగిరీల వారీగా అందరినీ ప్రోత్సహిస్తున్నాం.
రుణాల గురించి ఆలోచించకుండా ధైర్యంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి..’అని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహావీర్ సౌండ్ రూమ్ ఫౌండర్ జలీల్ సబీర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా, బీఎన్‌ఐ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment