
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ అయ్యారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, విజయ డెయిరీని చంద్రబాబు మూసేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరిచి మేలు చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి రోజా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకం ప్రజల పాలిట శ్రీరామ రక్ష. ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు. సీఎం జగన్ ఒక విజనరీ ఉన్న ముఖ్యమంత్రి. అందివచ్చిన టెక్నాలజీని ప్రజలకు చేరువ చేస్తూ ఈరోజు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. సొల్లు కబుర్లు చెప్పే చంద్రబాబు.. ఆయనను గెలిపించిన కుప్పం ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయారు. కానీ, సీఎం జగన్ కుప్పం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ చేసి చూపించారు అని కామెట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు.. లోకేష్‌పై అనిల్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment