
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే అడ్డుపడుతున్నారని మంత్రి శంకరనారాయణ విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ కారణంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభివృద్ధికి విఘాతం కల్గిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రి శంకరనారాయణ శుక్రవారం మాట్లాడుతూ.. ‘14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజావ్యతిరేకత మూటుగట్టుకున్నారు. 14 నెలల పాలనలోనే సీఎం జగన్ తనేంటో నిరూపించుకున్నారు. ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్.చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపాలి. సాక్ష్యాలు చూపాలని డీజీపీ లేఖ రాస్తే చంద్రబాబు ఎందుకు స్పందించరు.పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా టీడీపీ అడ్డుకుంది’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment