sankaranarayana
-
ఎమ్మెల్యే శంకరనారాయణ వాహనంపై డిటోనేటర్‌తో దాడి
గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ వాహనంపై ఆదివారం ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ డిటోనేటర్‌తో దాడిచేశాడు. అది పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే శంకరనారాయణ పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన హరిజన గణేశ్ తన జేబులో ఉన్న ఎలక్ట్రికల్ డిటోనేటర్ తీసుకుని ఎమ్మెల్యే వాహనంపై విసిరాడు. అది పేలలేదు. గమనించిన సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది వెంటనే గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నిందితుడు గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసన్ కంపెనీలో డ్రైవర్ విధులతోపాటు డిటోనేటర్లు పేల్చేపని చేసేవాడు. ఆదివారం అతిగా మద్యం తాగడంతో కాంట్రాక్టర్ పనుల్లో పెట్టుకోకుండా వెళ్లిపొమ్మన్నాడు. దీంతో అతడు నేరుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాడు. మద్యం మత్తులో ఎమ్మెల్యే వాహనంపైకి డిటోనేటర్ విసిరాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ డీఎస్పీ ఉసేన్‌పీరా గోరంట్ల స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరింత లోతుగా విచారించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన దురదృష్టకరం నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ ప్రభావం లేకుండా ప్రజలకు సేవచేస్తున్నా. డిటోనేటర్ పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన దురదృష్టకరం. పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ఎమ్మెల్యే శంకరనారాయణ -
బాబుచేతిలో పావు పవన్‌కల్యాణ్
సాక్షి, సోమందేపల్లి: సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని చంద్రబాబు... ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్‌ను పావుగా వాడుకుంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. సోమవారం ఆయన సోమందేపల్లిలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతూ, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ–1 పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. తమ ప్రచారం కోసం చంద్రబాబు కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారన్నారు. ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్‌కల్యాణ్... ఈ రెండు ఘటనల్లోని బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చారని, ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో బాబుకు లబ్ధి కల్పించడానికి తహతహ లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మాజీ కనీ్వనర్ వెంకటరత్నం, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గజేంద్ర, వైస్ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, మైనార్టీ సెల్ కనీ్వనర్ ఇమాం వలీ, మండల ప్రచార కార్యదర్శి నరసింహ మూర్తి, కో ఆప్షన్ సభ్యుడు రఫీక్, సర్పంచ్ అంజి నాయక్, కేజీబీవీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ రామాంజి, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: స్టేషన్‌కి చేరిన దున్నపోతు పంచాయితీ! మాదంటే..మాది అని గొడవ) -
గడ్కరీతో మంత్రి శంకరనారాయణ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సమావేశమయ్యారు. ఢిల్లీలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి గడ్కరీని కలిశారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ–భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఆరు లేన్ల రహదారి, కడప–రేణిగుంట రహదారి నిర్మాణాలకు అవసరమైన నిధుల గురించి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతపురం, చిత్తూరుతోపాటు ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అంతర్రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. తాము కోరిన అన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
టీడీపీ కార్యకర్త వేధింపులతో నరకం చూస్తున్నా!
సాక్షి, సోమందేపల్లి: రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడటం టీడీపీ వర్గీయులకు మామూలేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. సోమందేపల్లిలో టీడీపీ కార్యకర్త పద్మాచారి వేధింపులకు గురైన యువతి కుటుంబ సభ్యులను మంత్రి శంకరనారాయణ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత యువతికి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015లో తహసీల్దార్ వనజాక్షిని టీడీపీ నేతలు ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. ఆ పార్టీ నేతలు మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే వాటిని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. నారా లోకేష్ అవగాహనారాహిత్యంతో ట్వీట్లు, ఫేక్ వీడియోలు పెడుతున్నాడని.. ఓ యువతి పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి ప్రేమోన్మాదులకు మద్దతు పలకడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. 2018లోనే తాను లైంగిక వేధింపులకు గురవుతున్నానని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసార«థి అండతో స్ధానిక టీడీపీ నాయకుల సహకారంతో పద్మాచారి ఒక్క రోజులోనే స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడన్నారు. అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే మూడేళ్లుగా ఆ కుటుంబం మానసిక క్షోభకు గురయ్యేది కాదన్నారు. ప్రస్తుతం పోలీసులు యువతి కుటుంబానికి న్యాయం చేయాలని చూస్తుంటే మరో టీడీపీ కార్యకర్త కళాచారి బ్లాక్ మెయిల్ చేయడానికి ఆత్మహత్యాయత్నం డ్రామా చేస్తే బీకే పార్థసారథి అలాంటి వారిని పరామర్శించడం ఏమిటని నిలదీశారు. అదే ప్రాంతంలో ఉంటున్న యువతి కుటుంబానికి కనీస సానుభూతి తెలపకుండా వెళ్లడం సమంజసం కాదన్నారు. నిలదీసిన మహిళలపై టీడీపీ నాయకులు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడం ఆ పార్టీ తీరుకు నిదర్శనమన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ శ్రీహరితో మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, మాజీ సర్పంచ్‌లు డి.సి.ఈశ్వరయ్య, సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి అశోక్ తదితరులు పాల్గొన్నారు. మూడేళ్లుగా నరకం చూస్తున్నా సార్! మూడేళ్లుగా టీడీపీ కార్యకర్త పద్మాచారి వేధింపులతో నరకం అనుభవిస్తున్నా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసు పెట్టినా పలుకుబడితో ఒక్కరోజులోనే బయటకు వచ్చి లైంగిక వేధింపులకు గురి చేశాడు. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా అతనికి సహకరించడంతో నాకు అన్యాయం జరిగింది. అతని వేధింపులు భరించలేక ఎంబీఏ మధ్యలోనే ఆపేశాను. పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటే సంబంధాలు చెడగొడుతున్నాడు. మా ఇంటి ఎదురుగా గాలి మిషన్ ఏర్పాటు చేసి నిత్యం మా కుటుంబ సభ్యులను ఈవ్‌టీజింగ్ చేస్తున్నాడు. వెంటనే ఆ గాలి మిషన్ తొలగించేలా చూడండి. – మంత్రి శంకరనారాయణతో బాధిత యువతి ఆవేదన -
‘అభివృద్ధికి చంద్రబాబే అడ్డుపడుతున్నారు’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే అడ్డుపడుతున్నారని మంత్రి శంకరనారాయణ విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ కారణంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభివృద్ధికి విఘాతం కల్గిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శంకరనారాయణ శుక్రవారం మాట్లాడుతూ.. ‘14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజావ్యతిరేకత మూటుగట్టుకున్నారు. 14 నెలల పాలనలోనే సీఎం జగన్ తనేంటో నిరూపించుకున్నారు. ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్.చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపాలి. సాక్ష్యాలు చూపాలని డీజీపీ లేఖ రాస్తే చంద్రబాబు ఎందుకు స్పందించరు.పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా టీడీపీ అడ్డుకుంది’ అని విమర్శించారు. -
సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు
సాక్షి, కదిరి: ‘‘ఆదాయ పన్నుల శాఖ దాడుల్లో చంద్రబాబుకు ప్రైవేటు కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో రూ.2వేల కోట్లు పట్టుబడ్డాయి. అందుకే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ బాబును తక్షణం అదుపులోకి తీసుకోవాలి. లేదంటే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు సమర్థుడు.’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శనివారం ఆయన కదిరిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉంటూ రాష్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టి అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయంటే ఇక చంద్రబాబును తనిఖీ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటకు వస్తాయోనని అనుమానం వ్యక్త పరిచారు. చంద్రబాబు అక్రమ సంపాదనంతా విదేశాల్లో దాచారని.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, ఆ డబ్బు మొత్తం రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బినామీలుగా ఉంటూ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్లు, వారికి సంబందించిన సంస్థల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తే పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడిందని మంత్రి గుర్తు చేశారు. వీరితో గానీ, ఈ వ్యక్తులతో గానీ చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేదని టీడీపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి పదే పదే చెప్పడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రజా ధనం లక్షల కోట్లు దురి్వనియోగం జరిగిందన్నారు. పోలవరంను చూసొద్దాం రండి.. అంటూ అందులో కూడా చంద్రబాబు తో పాటు ఆ పార్టీ నేతలు ప్రజా ధనం దోచుకున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక ఇలా ప్రతిదాంట్లోనూ అవినీతి జరిగిందని, గత ఐదేళ్లలో ఖర్చు చేసిన నిధులపై సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సాక్షి, అనంతపురం(పెనుకొండ) : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్లు ప్రజలను మోసగించిన చంద్రబాబుకు ప్రజలు 23 ఎమ్మెల్యేలతో సరిపెట్టారన్నారు. ఘోర ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఆయనపై ఓర్వలేక బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా చేసి ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారన్నారు. అమరావతిలో ఉన్నది ముళ్ల కంపలు, డ్రైనేజీలే తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఐదేళ్ల టీడీపీ పాలనలో హత్యలు తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. దుద్దేబండ, వెంకటగిరిపాళ్యం, రామగిరి వంటి ప్రాంతాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు తెగబడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లా ఎస్పీగా సత్యయేసుబాబును నియమించడం వెనుక జిల్లాలో శాంతి కుసుమాలు విరబూయించాలనే ఉద్దేశం ఉందన్న అంశాన్ని టీడీపీ నాయకులు అవగతం చేసుకోవాలన్నారు. -
రైతులను పూర్తిగా మోసం చే శారు
పెనుకొండ రూరల్ : కరువును నివారించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధపు మాటలతో రైతులను పూర్తిగా మోసం చేశాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. మండలంలోని మరువపల్లి గ్రామంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వేరుశనగ వేసిన రైతులకు రక్షక తడులు ఇస్తున్నామని సీఎం రైతులను మోసగిస్తున్నారన్నారు. రైతులు రెయిన్గన్లు, డీజల్ మోటార్లు ఇవ్వలేదని తమ ముందు వాపోతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. కల్లిబొల్లి మాటలతో రైతులను మోసం చేయకుండా వేరుశనగ పంటకు 100 శాతం ఫసల్ బీమా కల్పించాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం కూడా జిల్లాలో రైతులు వేరుశనగ పంట వేసి నష్టపోయారన్నారు. వారికి ఇంత వరకు బీమా మంజూరు చేయలేదని విమర్శించారు.